ఇవాళ జనగామ, భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: జనగామ మెడికల్ కాలేజీ మైదానంలో కేసీఆర్ బహిరంగసభ
ఇవాళ జనగామ, భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: సీఎం కేసీఆర్... జోరు పెంచారు. నిన్న మేనిఫెస్టో ప్రకటించి, అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడమే కాకుండా...హుస్నాబాద్ వెళ్లి... ఎన్నికల శంఖారావం కూడా పూరించారు. ఇక ఆయన ఆగేది లేదు. వచ్చే నెల 8 వరకూ సభలే సభలు. వైరల్ ఫీవర్‌తో రెండు వారాలు బాధపడిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎక్కడ లేని ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. నిన్న బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన ఆయన..ఆ తర్వాత హుస్నాబాద్ వెళ్లి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ఇవాళ జనగామ, భువనగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. మూడోసారి గెలిచి తీరాలనే పట్టుదలే ఆయన్ని ఉరికలెత్తిస్తోంది.
ఇవాళ జనగామలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరబోతున్నారు. జనగామలోని మెడికల్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ ఉంది. దీని కోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు జనగామ సభాకు వెళ్తారు. తర్వాత భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలోని ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తారు. ఈ సభల కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. భారీగా జన సమీకరణ కూడా జరుగుతోంది.