ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్

CM KCR: కొత్తగూడెం, ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభలు

Update: 2023-11-05 03:45 GMT

ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్

CM KCR: సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్‌...మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రకాశం స్టేడియంలో అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలో శాసనసభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగించనున్నారు. ఈ సభలకు భారీగా బీఆర్ఎస్ నేతలు జనసమీకరణ చేస్తుండగా..అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేశారు. ఖమ్మంలో సీఎంసభా ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పరిశీలించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్‌ఎస్‌ అధినేత హోదాల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సభల్లో సీఎం కేసీఆర్‌ స్థానిక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన నేతల వ్యవహార శైలిని తూర్పారబడుతున్నారు.

కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ సభలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం పాల్గొననున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కూడా సీఎం పాల్గొననున్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌ రానుండడంతో ఆయా జిల్లాల పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఖమ్మంలోని పలేట్‌ స్టేడియంలో, కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో హెలీప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు.

Tags:    

Similar News