Yadadri Temple: రేపు యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం
Yadadri Temple: మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
Yadadri Temple: రేపు యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత సాయంత్రం 4 గంటలకు స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా 70 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు 3వేల మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు సంబంధిత అధికారులు.