మోదీ సందేశంపై స్పందించిన కేసీఆర్

21 రోజుల లాక్ డౌన్ విధించిన తరవాత ప్రధాని మోడీ మళ్లీ మరోసారి వీడియో సందేశం ఇచ్చారు.

Update: 2020-04-03 16:51 GMT
KCR (File Photo)

21 రోజుల లాక్ డౌన్ విధించిన తరవాత ప్రధాని మోడీ మళ్లీ మరోసారి వీడియో సందేశం ఇచ్చారు. 130 కోట్ల భారతీయుల ఏప్రిల్ 5 ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి, మొబైల్ టార్చ్ కూడా ఆన్ చేయవద్దని, తలుపులు మూసేసి గుమ్మం ముందు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని సూచించారు. దీనివల్ల ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు అన్ని చోట్ల నుంచి మద్దతు లభిస్తోంది.

తాజాగా ప్రధాని పిలిపుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పోస్ట్ ని పెట్టారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 5న రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని ముఖ్యమంత్రి అభిలషించారు. 

Full View


Tags:    

Similar News