టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్‌.. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తున్న కేసీఆర్‌..

Survey: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు.

Update: 2022-01-09 12:30 GMT

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్‌.. ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తున్న కేసీఆర్‌..

Survey: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. అందుకోసం ఎమ్మెల్యేల పనితీరు, వారిపై స్థానికంగా ఉన్న ప్రజాభిప్రాయంపై అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు గెలిచే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారిపై ఏ మేరకు వ్యతిరేకత ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన ఈ అంతర్గత సర్వేలు ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 103. అందులో 68 మంది రెండుసార్లు.., అంతకన్నా ఎక్కువ సార్లు విజయం సాధించారు. అయితే వరుసగా విజయాలు సాధిస్తున్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అభిప్రాయంతో టీఆర్ఎస్‌ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చిన ఐదు స్థానాల్లో కూడా టీఆర్ఎస్‌ విజయం సాధించింది. అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించకపోయినా తాము చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను మరోసారి ప్రజలకు చెబితే ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం పెట్టుకున్నారు కేసీఆర్‌.

ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సర్వే ఫలితాలను పక్కన పెడుతూ మెజారిటీ సీట్లు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు ఈ ఎన్నికల్లో ఇచ్చారు. దీంతోనే సగం మంది ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు ఇదే సూత్రం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు. అందుకే సర్వేల ద్వారా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని కేసీఆర్‌ అంచనా వేస్తుండగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో గుబులు ప్రారంభమైంది.

Tags:    

Similar News