CM KCR: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు అల్లూరి
CM KCR: అల్లూరిది గొప్ప చరిత్ర
CM KCR: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు అల్లూరి
CM KCR: భరతమాత గర్వించే ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజని కొనియాడారు సీఎం కేసీఆర్. గచ్చిబౌలిలో అల్లూరి 125 జయంతి ముగింపు ఉత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకున్నారు. అల్లూరిది గొప్ప చరిత్ర అని..మన్యం వీరుల కన్నీళ్లు తుడిచి గడ్డిపరకలను గడ్డపారాలుగా మలిచిన మహనీయుడు అల్లూరి అన్నారు. రాష్ట్రపతి ముర్ము సమక్షంలో అల్లూరి జయంతి ముగింపు ఉత్సవాలు జరగడం ముదావహం అని సీఎం కేసీఆర్ అన్నారు.