వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు

Update: 2020-12-13 12:15 GMT

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇబ్బందులు తలెత్తాయి.. ఇకపై జాప్యం కావొద్దని సీఎం అన్నారు. సమస్యలు తొలగి సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్‌లు జరగాలని సీఎం సూచించారు. అందుకోసం విధివిధానాలు ఖరారు చేయాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు..

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌ల కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఈ కమిటీలో మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని సీఎం తెలిపారు. మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలన్నారు. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావొద్దని అన్నారు.

Tags:    

Similar News