Telangana Lockdown: లాక్‌డౌన్‌పై పునరాలోచన..కరోనాపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Telangana Lockdown 2021: లాక్‌డౌన్‌ అమలు రాష్ట్రాలకు వదిలేసిన కేంద్రం * పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. నైట్‌ కర్ఫ్యూ అమలు

Update: 2021-04-29 06:11 GMT

కెసిఆర్ సమీక్ష సమావేశం (ఫైల్ ఇమేజ్)

Telangana Lockdown 2021: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్ కల్లోలం‌. పాజిటివ్‌ కేసుల పెరుగుదలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన. దీంతో లాక్‌డౌన్‌ పెట్టాలా..? వద్దా..? అనే ఆలోచనలో ప్రభుత్వం. మునుముందు మ్యూటేషన్‌ కేసులు వస్తాయనే హెచ్చరికలతో లాక్‌డౌన్‌ అమలుపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు.

తెలంగాణలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. అయితే.. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామే తప్పా లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు.. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో.. ఇప్పుడు లాక్‌డౌన్‌ పెట్టే అంశంపై అధికారులు పునరాలోచిస్తున్నారు. అంతేకాదు రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

 ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. అయితే గతంలో లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా ఉండటం కోసం సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇక లాక్‌డౌన్‌ పెట్టాలనుకుంటే దానికి మూడురోజుల ముందే లాక్‌డౌన్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సొంతగ్రామాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించనున్నారు. ఇదిలా ఉండగా.. గతంలోలాగా రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా పాక్షిక లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 12వరకు పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు.

Tags:    

Similar News