kcr reaches pragathi bhavan : రెండు వారాల తరువాత..

Update: 2020-07-11 13:35 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైల్ ఫోటో

kcr reaches pragathi bhavan : తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ గత నెల చివర్లో జరిగిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుంచి సీఎం కేసీఆర్ కేసీఆర్ కనిపించకుండా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకుడు ఎంతో మంది కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అంతే కాదు వారితో పాటు కొంత మంది నెటిజన్లు కూడా హైదరాబాద్‌‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం అజ్ఞాతంపై విమర్శలు చేశారు. వాటితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా రాష్ట్ర సీఎంకు సంబంధించిన ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అంతే కాక #WhereIsKCR హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఇద్దరు యువకులు సీఎం కనిపించకపోవడంపై ఏకంగా ప్రగతిభవన్‌ ఎదుట హల్ చల్ కూడా చేసారు. ''సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు'' అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ తరువాత పోలీసులు వారిని పట్టుకుందాం అనే లోపే వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇక తీన్మార్‌ మల్లన్న అయితే ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ హైకోర్టులోనే పిటిషన్‌ కూడా దాఖలు చేసారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మళ్లీ అందరి ముందుకు వచ్చారు. శనివారం సాయత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆయన గత రెండు వారాలుగా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లోనే ఉన్నట్లుగా సమాచారం. తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్ అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రైతులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రైతులతో జరపాలనుకుంటున్న సమావేశానికి సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News