CM KCR: ప్రగతి భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కోవిడ్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-05-06 11:44 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫొటో హెచ్‌ఎంటీవీ)

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన కోవిడ్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సూచనల దృష్యా వీకెండ్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత నెల 19న కరోనా పాజిటీవ్ గా వచ్చిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కేసీఆర్ ఫాం హౌస్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. గత మంగళవారం ఆయనకు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈసారి కోవిడ్‌ నెగిటివ్‌ రావడంతో ప్రగతి భవన్ చేరుకుని అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 52 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,75,748కు చేరుకుంది. అలాగే 2,579 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News