మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్.. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై ఆరా
CM KCR: వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు.. NDRF బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని ఆదేశం
మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్.. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై ఆరా
CM KCR: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మున్నేరు వరద ఉధృతిలో ఏడుగురు చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రంగంలోకి NDRF బృందం దిగింది. జిల్లా వ్యాప్తంగా వరదలపై మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు NDRF బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి ఖమ్మంకు మంత్రి పువ్వాడ బయల్దేరి వెళ్లారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న NDRF బృందాన్ని.. మార్గమధ్యంలో మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాసేపట్లో మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్నవారిని రెస్క్యూ చేస్తామని సీఎం కేసీఆర్‌కు చెప్పారు మంత్రి పువ్వాడ. మరోవైపు.. ప్రత్యేక డ్రోన్ పంపించి.. ఇంట్లో చిక్కుకున్నవారి పరిస్థితిని ఆరా తీస్తున్నారు అధికారులు.