Kishan Reddy: TSPSC వైఫల్యానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దే
Kishan Reddy: పేపర్ లీకేజీ వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు
Kishan Reddy: TSPSC వైఫల్యానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దే
Kishan Reddy: అక్టోబర్ 1న ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. TSPSC వైఫల్యానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దే అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పరీక్షల కోసం అప్పులు చేసి మరీ ప్రిపేర్ అయ్యారని,, పేపర్ లీకేజీ వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ వైఫల్యం కారణంగానే నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.