BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన గులాబీ బాస్ కేసీఆర్
BRS Party Office: పార్టీ ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన గులాబీ బాస్ కేసీఆర్
BRS Party Office: ఢిల్లీలోని వసంత విహార్ లో.. మొత్తం 13 వందల గజాల స్థలంలో..5 అంతస్థుల్లో BRS భవనాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ లో మీడియా సమావేశాలను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్ తో పాటు రెండు ఇతర గదులను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ను సిద్ధం చేశారు. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి ఛాంబర్ , పేషీలతో పాటు ఒక కాన్ఫరెన్స్ హాలును ఏర్పాటు చేశారు. రెండవ, మూడవ అంతస్థుల్లో దేశ రాజధానిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు.. మరో రెండు ప్రత్యేక సూట్ రూమ్స్ ఉన్నాయి.