KCR Review on Rains: తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

* అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం * జిల్లాల్లో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎం

Update: 2021-07-22 08:15 GMT

కెసిఆర్ (ఫైల్ ఫోటో) 

KCR Review on Rains: తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎం అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎస్‌కు ఆదేశించారు. ఇక, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు.

గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంపైనా కేసీఆర్ ఆరా తీశారు. ఎస్సార్‌ఎస్పీకి ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దాంతో, గోదావరి నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. నిర్మల్ పట్టణం నీట మునగడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎస్‌కు ఆదేశించారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్‌‌గా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News