తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు

తెలంగాణ రైతులకు తీపి కబురు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. వరి ధాన్యం సేకరణకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. మద్దతు ధరకే పంటను కొనుగోలు చేస్తామని హామి ఇచ్చారు

Update: 2020-10-23 13:35 GMT

తెలంగాణ రైతులకు తీపి కబురు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. వరి ధాన్యం సేకరణకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. మద్దతు ధరకే పంటను కొనుగోలు చేస్తామని హామి ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో పసుపుకు అంతరపంటగా మొక్కజొన్న వేయాలని సూచించినట్లు వివరించారు. మద్దతు ధర వచ్చే పరిస్థితులు లేనందునే వానాకాలం మొక్కజొన్న వేయొద్దని రైతులను కోరినట్లు సీఎం తెలియజేశారు. అయితే ప్రభుత్వం వద్దని చెప్పినా.. రైతులు మొక్కొజన్న సాగు చేశారన్నారు. ఇక రైతులు నష్టపోవద్దని మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తీపి కబురు చెప్పారు సీఎం. మొక్కజొన్నకు 1850 రుపాయల మద్దతు ధర చెల్లించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News