యాదాద్రి ఆలయ పునప్రారంభంపై సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే యాదాద్రి ఆలయ పునప్రారంభంపై సమీక్ష నిర్వహించనున్నారు

Update: 2021-09-05 07:14 GMT

యాదాద్రి దేవస్థానం పై సమీక్ష నిర్వహించనున్న సీఎం కెసిఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CM KCR: యాదాద్రి ఆలయ అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే యాదాద్రి ఆలయ పునప్రారంభంపై సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులకు మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పనులు పూర్తిచేసేందుకు వర్క్ ఏజెన్సీలతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పనులను దసరా నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఆలయ పున: ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయం ఉద్ఘాటన కార్యక్రమానికి వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన దసరాలోగా కొండపై కట్టడాలన్నింటినీ పూర్తిచేయాలని సంకల్పించారు. 

Tags:    

Similar News