CM KCR: అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలి
CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
CM KCR: అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలి
CM KCR: సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మహారాష్ట్రలో పర్యటించిన సీఎం కేసీఆర్...వాటేగావ్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాఠే చిత్రపటానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.