Yadadri: యాదాద్రి ఆలయ పున:ప్రారంభ తేదీ ఖరారు

Yadadri: మార్చి 28 2022న యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణం

Update: 2021-10-19 14:46 GMT
యాదాద్రి దేవస్థానం పునఃప్రారంభం తేదీ ఖరారు (ఫైల్ ఇమేజ్)

Yadadri: యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ పున:ప్రారంభంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ జరగనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మహా కుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్న సీఎం మొత్తం వెయ్యి 8 కుండలతో మహా సుదర్శన యాగం జరగనుందన్నారు.

మరోవైపు నృసింహుని విమాన గోపురానికి 125 కిలోలతో స్వర్ణ తాపడం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మొత్తం బంగారం RBI నుంచి కొనుగోలు చేస్తామన్న కేసీఆర్ తమవంతు భాగంగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. అలాగే, మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి కేజీ బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఇదే కాకుండా పలువురు టీఆర్ఎస్ ప్రతినిధులు బంగారాన్ని వారాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారన్నారు.

Tags:    

Similar News