రేపు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్
CM Jagan: కేసీఆర్‌ను కలవనున్న జగన్
రేపు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్
CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జగన్ పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడటంతో.. కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోదా వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వారం పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిసెంబర్ 15న కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.