GHMC: యాప్రాల్ లో క్లీన్ అండ్ గ్రీన్ మీద అవగాహనా సదస్సు కార్యక్రమం
* పాల్గొన్న సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ * యాప్రాల్ ప్రజలు జీహెచ్ఎంసీ కి సహకరించాలన్న మురళీధర్
క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం (ట్విట్టర్ ఫోటో)
Clean And Green Program: GHMC కమిషనర్ ఆదేశాలు మేరకు రాబోయే రెండు రోజుల్లో యాప్రాల్‌లోని అన్ని కాలనీల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ తెలిపారు. కాలనీలో రోడ్లు, పచ్చదనం పెంపొందేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే నెల రోజుల్లో డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బయోటెక్ వాళ్లు పచ్చదనాన్ని డెవలప్ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారని వెల్లడించారు. యాప్రాల్‌లోని యస్ యస్ ఎన్‌క్లేవ్, యాప్రాల్‌లోని పలు కాలనీల్లో క్లీన్ అండ్ గ్రీన్ మీద అవగాహాన సదస్సు మురళీధర్ పాల్గొన్నారు. కాలనీ వాసులు, ప్రజలు జీహెచ్ఎంసీకి సహకరించాలని కోరారు.