Khammam: మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ.. దాడిలో నలుగురు యువకులకు గాయాలు

Khammam: కోదాడ క్రాస్‌ రోడ్డులోని ఓ దాబాలో అర్ధరాత్రి గొడవ

Update: 2024-02-04 09:38 GMT

Khammam: మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ.. దాడిలో నలుగురు యువకులకు గాయాలు

Khammam: ఖమ్మం జిల్లాలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోదాడ క్రాస్‌ రోడ్డులోని ఓ దాబాలో అర్ధరాత్రి గొడవ జరిగింది. తెల్దారుపల్లి యువకులపై ఖమ్మం యువకులు దాడికి పాల్పడ్డారు. దాడిలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చి చికిత్సపొందుతున్న బాధితులపై... మళ్లీ దాడికి పాల్పడ్డారు ఖమ్మం యువకులు. అడ్డుకున్న ఖమ్మం రూరల్‌ ఎస్సై సురేష్‌, కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారికోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News