Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

Asifabad: రైస్ మిల్ యజమాని వద్ద లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ డీఎం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.

Update: 2025-11-07 06:35 GMT

Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

Asifabad: రైస్ మిల్ యజమాని వద్ద లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ డీఎం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రైస్ మిల్ నుంచి సిఎంఆర్ బియ్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి.. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు, ఒక్కో లారీకి 25 వేల రూపాయలను డీఎం నర్సింగరావు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

మూడు లారీలకు సంబంధించి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా.. డీఎం నర్సింగరావును అధికారులు పట్టుకున్నారు. డీఎంతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాధితుడు నుంచి ఇప్పటికే 16 లారీలకు సంబంధించి డబ్బులు తీసుకున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News