Chinta Prabhakar: అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్
Chinta Prabhakar: మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు
Chinta Prabhakar: అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్
Chinta Prabhakar: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చింత్రా ప్రభాకర్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అభినందించారు. ఇక చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానని చింతా ప్రభాకర్ అన్నారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. చదువుకునే రోజుల నుంచే కేసీఆర్‌కు చేనేత కార్మికుల సమస్యలు తెలుసని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌ను సీఎం కేసీఆర్ ఈ నెల 13న నియమించారు. రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి