చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిపై దాడి... కారణం ఏంటంటే...

Update: 2025-02-09 12:09 GMT

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిపై దాడి... కారణం ఏంటంటే...

Attack on Chilukuru Balaji temple chief priest CS Rangarajan: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాటీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగింది. రంగ రాజన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ వచ్చిన వ్యక్తులు రామరాజ్యం స్థాపన కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తనని కోరారని రంగరాజన్ తెలిపారు.

అయితే, అందుకు తాను నిరాకరించడంతో వారు తనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారని వాపోయారు. తన కుమారుడు అడ్డు రాగా ఆయనపై కూడా దాడి చేసి పారిపోయారని అన్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇవాళే ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

దాడి ఘటనపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని రంగరాజన్ చెప్పారు. రంగరాజన్ ఇంటి ఆవరణలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన వాళ్లు ఎవరు, వారి లక్ష్యం ఏంటి అనే విషయంలో తనకు స్పష్టత లేదన్నారు. పోలీసుల విచారణలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

భక్తుల్లో ఆధ్మాత్మిక భావన పెంచుతూనే వారికి ఆ చిలుకూరు బాలాజీ గురించి, ఆలయ స్థల పురాణం గురించి ఆకట్టుకునేలా చెబుతుంటారు. అందుకే చిలుకూరు బాలాజీ దర్శనానికి వచ్చే భక్తులకు రంగరాజన్‌ ఎంతో సుపరిచితం.

Full View

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News