భక్తులతో పోటెత్తిన చిలుకూరు బాలాజీ క్షేత్రం.. 108 ప్రదక్షిణల నిలిపివేత
Chilkur Balaji Temple: దాదాపు 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
భక్తులతో పోటెత్తిన చిలుకూరు బాలాజీ క్షేత్రం.. 108 ప్రదక్షిణల నిలిపివేత
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నూతన సంవత్సరం సందర్భంగా చిలుకూరు ఆలయానికి వివిద ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలో 108 ప్రదక్షిణలను నిలిపివేశారు. మరోవైపు భారీగా వాహనాలు చిలుకూరుకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.