Jagtial: విషాదం.. స్కూల్ బస్సుకింద పడి చిన్నారి మృతి

Jagtial: అన్నను బస్సు ఎక్కించడానికి తల్లితో పాటు వెళ్లిన చిన్నారి

Update: 2024-04-16 05:37 GMT

Jagtial: విషాదం.. స్కూల్ బస్సుకింద పడి చిన్నారి మృతి

Jagtial: జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి, ఏడాదిన్నర వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి తల్లితో పాటు చిన్నారి వెళ్లింది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. అప్పటివరకు తల్లి వెనకాల తిరిగిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News