Revanth Reddy: నేడు ప్రజా దర్బార్.. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష
Revanth Reddy: ప్రజల సమస్యలను స్వీకరించనున్న సీఎం రేవంత్
Revanth Reddy: నేడు ప్రజా దర్బార్.. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష
Revannth Reddy: కాసేపట్లో ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు సీఎం రేవంత్. ఇక విద్యుత్‌శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. నిన్న కేబినెట్లో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం.. ఇవాళ పూర్తి వివరాలతో రావాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని .. ఇవాళ రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.