Chepa Mandu: జూన్ 8వ తేదీన చేపమందు ప్రసాదం
Chepa Mandu: జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటలను చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్ సోదరులు తెలిపారు.
Chepa Mandu at Hyderabad:(File Image)
Chepa Mandu: జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేప ప్రసాం పంపిణీ చేయనున్నట్లు బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే జనానికి హైదరాబాద్ దూద్ బౌలిలోని మృగశిర ట్రస్టు భవన్ లో చేప ప్రసాదం ఇస్తామని బత్తిని సోదరుడు హరినాథ్ గౌడ్ శనివారం వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజు 24 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.