HRC: చేవెళ్ల ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌

HRC: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (HRC) స్పందించింది.

Update: 2025-11-04 10:18 GMT

HRC: చేవెళ్ల ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌

HRC: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (HRC) స్పందించింది. ఈ ఘటనను కమిషన్ సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించింది.

కమిషన్ జారీ చేసిన ఆదేశాల మేరకు, డిసెంబర్ 15 లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని రవాణా శాఖ, హోంశాఖ, మరియు భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు పంపింది.

వీరితో పాటు, జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ ఎండీలను కూడా ఈ ఘటనకు సంబంధించిన నివేదికను పంపాలని కమిషన్ ఆదేశించింది.

మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 24 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News