షాద్‌నగర్‌లో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. మారణ ఆయుధాలతో సంచరించిన నలుగురు
*సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు రికార్డు
షాద్‌నగర్‌లో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. మారణ ఆయుధాలతో సంచరించిన నలుగురు
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మై హోం వెంచర్‌లో ఓ ఇంటి సమీపంలో నలుగురు సభ్యులు ఉన్న ముఠా చేతిలో మారణ ఆయుధాలతో సంచరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనితో స్థానిక కాలనీ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి కదలికలు వేషధారణ చెడ్డి గ్యాంగ్ ల ఉండడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.