Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు ..తులంపై ఎంత తగ్గిదంటే?
Gold Rate Today: నేడు అంటే సెప్టెంబర్ 11, బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం 100 రూపాయల కన్నా తక్కువగా ఉంది.
Gold and Silver prices today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: నేడు అంటే సెప్టెంబర్ 11, బుధవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం 100 రూపాయల కన్నా తక్కువగా ఉంది. నేటి పసడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,750 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు అటు అమెరికాలో కూడా తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
ముఖ్యంగా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఇటీవల అమెరికాలో విడుదలైన జాబ్స్ డేటా ఆశించినంత క్షీణించలేదు. దీంతో మార్కెట్లో పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. ఫలితంగా బంగారం అంతర్జాతీయంగా తగ్గింది. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2500 డాలర్లకు చేరుకుంది. దీంతో బంగారం ధర ఈ నెల ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 50 డాలర్లు తగ్గింది.
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే వడ్డీరేట్లను పావు శాతం మీద తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇలా జరిగితే మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తే, అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్ల విలువ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పతనం అయినప్పుడు కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పెద్ద ఎత్తున బంగారంలో పెడతారు.
ఇందులో ఉంటే రాబోయే ఫెస్టివల్ సీసన్ దసరా దీపావళి సందర్భంగా ఆభరణాల దుకాణాలు మరోసారి కళకళలాడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బంగారం ధరలు దేశీయంగా మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫెస్టివల్స్ సీజన్లో బంగారు ఆభరణాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే అమెరికాలో రాబోయే ఎన్నికలు కూడా బంగారం ధరలు డిసైడ్ చేసే ప్రధాన అంశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.