ఐఎస్ఐ ప్రమాణాలు లేని హెల్మెట్లు వాడితే చలానాల మోతే

రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం ఓవర్‌స్పీడ్‌, హాఫ్ హెల్మెట్లు వాడటమే కారణమని గుర్తించిన పోలీస్‌శాఖ

Update: 2019-11-25 16:49 GMT
ISI helmet

మీరు హెల్మెట్ కొంటున్నారా? మీ హెల్మెట్‌కు ఐఎస్ఐ మార్క్ లేదా? అయితే జరభద్రం. పోలీసుల కళ్ళు గప్పేందుకు డూప్లికేట్ హెల్మెట్లు పెట్టుకుంటే సేప్‌ కంటే డేంజరే ఎక్కువే. రోడ్లపై పారుతున్న రక్తపు మరకలకు చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది పోలీస్‌ శాఖ. పోలీస్‌లు తీసుకున్న నిర్ణయమేంటో తెలియాలంటే ఈ వార్త చదావాల్సిందే

ఇన్ని రోజులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించేవారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా ఫైన్ విధిస్తారు. ఎందుకంటే ఆ హెల్మెట్ ఐఎస్ఐ గుర్తు అయి వుండాలి. అది లేకుండా ఏదో ఒక నాసిరకం హెల్మెట్ వాడితే చలానాల మోతే మోగనుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు కళ్లెం వేస్తున్నా కూడా.. వరసగా యాక్సిడెంట్స్ జరగడాన్ని పోలీస్ డిపార్ట్ మెంట్ సీరియస్‌గా తీసుకుంది.

రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం ఓవర్‌స్పీడ్‌, హాఫ్ హెల్మెట్లు వాడటమే కారణమని గుర్తించిన పోలీస్‌శాఖ అప్రమత్తమైంది.పోలీసుల కళ్ళు గప్పి ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోడానికే..నకిలీ హెల్మెట్లు వాడుతున్నవారిపై స్పెషల్‌ఫోకస్‌ పెట్టింది. హాఫ్ హెల్మెట్లు వాడినా బైకర్స్‌ ఫోటోలను చిత్రీకరించి నేరుగా వారి ఇంటికే చలానాలను పంపుతున్నారు. దీంతో అలర్ట్‌ అయిన వాహనదారులు ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌ను కొనేందుకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా భావించి వ్యాపారులు నాసిరకం హెల్మెట్లు వాహనదారులకు అంటకట్టి సొమ్ముచేసుకుంటున్నారు.

ఐఎస్ఐ ప్రమాణాలున్న హెల్మెట్‌నే తప్పనిసరిగా ధరించాలని ఆంక్షలు విధించిన సైబరాబాద్ పోలీస్‌లు... నగర వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఐఎస్‌ఐ మార్క్‌తో కూడిన హెల్మెట్లు మాత్రమే విక్రయాలు జరపాలని..వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్రాండెడ్ హెల్మెట్‌ అంటూ తక్కువ ధరకు విక్రయాలు చేస్తున్న వ్యాపారులపై దృష్టి సారించి... వారి నుంచి భారీగా నకిలీ హెల్మెట్లు స్వాదీనం చేసుకోని ధ్వంసం చేయడంతో పాటు నకిలీ హెల్మెట్లు అమ్ముతున్న వ్యాపారులతో ప్రతిజ్ఞ చేయించారు.

94 శాతం మంది హెల్మెట్‌ సరిగ్గా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని సీపీ సజ్జనార్‌ అన్నారు. వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్లు ధరించి ప్రమాదాల నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. రోడ్ల వెంట విచ్చలవిడిగా నాసిరకం హెల్మెట్లను విక్రయిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Tags:    

Similar News