Hyderabad: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
Hyderabad: ప్లాట్‌ఫామ్ సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
Hyderabad: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
Hyderabad:హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌కు చేరుకునే సమయం కావడంతో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో పెనుప్రమాదం తప్పింది.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. పలువురికి స్వల్పగాయాలు అయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.