Chandrababu And Pawan Kalyan: డిన్నర్ మీట్‌.. రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఇంటికి పవన్‌

Chandrababu And Pawan Kalyan: డిన్నర్ మీటింగ్‌లో చర్చించనున్న ఇరువురు నేతలు

Update: 2024-01-13 13:15 GMT

Chandrababu And Pawan Kalyan: డిన్నర్ మీట్‌.. రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఇంటికి పవన్‌

Chandrababu And Pawan Kalyan: ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్‌. డిన్నర్ మీట్‌‌లో ఇరువురు నేతలు సమావేశమవుతారు. ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు.

ఇప్పటికే చంద్రబాబు, పవన్‌ మధ్య ఓ దఫా చర్చలు జరగగా.. అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఇంకా క్లారిటీ లేదు. భవిష్యత్‌లో జరిగే జనసేన, టీడీపీ సంయుక్త బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని గత సమావేశంలో చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.

Tags:    

Similar News