Peddapalli: లాయర్ వామన్ రావు హత్య కేసులో సీబీఐ విచారణ..
లాయర్ వామనరావు హత్య కేసులో సీబీఐ విచారణ గుంజపడుగులో వామన్ రావు ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారుల బృందం వామన్ రావు దంపతుల హత్యపై కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ
లాయర్ వామన్ రావు హత్య కేసులో సీబీఐ విచారణ..
తెలంగాణలో సంచలనం సృష్టించి లాయర్ వామనరావు హత్యపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలో వామన్‌రావు ఇంటికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. వారి కుటుంబ సభ్యుల నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
కాగా 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులైన గట్టు వామనరావు, ఆయన భార్య పీవీ నాగమణిలను నడిరోడ్డుపై దుండగులు హత్య చేయగా...ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.