తప్పుడు పత్రాలతో రూ.16కోట్ల రుణం.. ఎస్‌బీఐ అధికారులపై సీబీఐ దాడులు

Update: 2020-01-03 07:18 GMT
ఎస్‌బీఐ అధికారులపై సీబీఐ దాడులు

హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. నకిలీ పత్రాలతో రుణాలు పొందిన ఆరుగురు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు పత్రాలతో పాటు లేని వారిని ఉన్నట్లుగా చూపి కొందరు ఎస్‌బీఐ ఉన్నత ఉద్యోగులు ముఠాగా ఏర్పడి రుణాలు పొందారు. రీన్‌ లైఫ్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ పేరుతో రుణాలు తీసుకున్నారు. రీన్‌ లైఫ్‌ ల్యాబ్స్‌ పేరుతో సుమారు 16 కోట్ల రూపాయల రుణం పొందింది ఈ ముఠా. హైదరాబాద్‌, బెంగళూరు, మైసూర్‌లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Tags:    

Similar News