కారు యజమాని ఓవర్ యాక్షన్‌..కారుకి సైడ్‌ ఇవ్వలేదని..

Update: 2019-06-19 13:56 GMT

భూపాలపల్లిలో కారు యజమాని ఓవర్ యాక్షన్‌ చేశాడు. తన కారుకి సైడ్ ఇవ్వలేదని లారీ డ్రైవర్‌‌పై దౌర్జన్యం చేశాడు. నడిరోడ్డుపై లారీని ఆపి అద్దాలు పగలగొట్టాడు. లారీ తాళాలు తీసుకుని డ్రైవర్‌‌పై దౌర్జన్యం చేసిన కారు ఓనర్‌ నానా హంగామా చేశాడు. తప్పు చేశాను క్షమించమని వేడుకుని కాళ్లు మొక్కినా కారు యజమాని కనికరించలేదు. ఇదంతా గమనించిన స్థానికులు కారు ఓనర్‌ తీరుపై మండిపడ్డారు. తాళం ఇచ్చేయాలంటూ కారు యజమానిని కోరారు. అయితే స్థానికులు చెప్పినా కనికరించని కారు ఓనర్‌ లారీ తాళాన్ని దూరంగా విసిరేసి కర్కసత్వాన్ని చూపించాడు.

లారీ డ్రైవర్‌పై దౌర్జన్యంచేసి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించిన వ్యక్తి కూడా పది లారీలకు ఓనర్‌గా స్థానికులు చెబుతున్నారు. పైగా ఇతని భార్య జెన్‌కోలో ఏఈగా పనిచేస్తోందని, ఆ ధీమాతోనే ఇలా రెచ్చిపోతూ ఉంటాడని అంటున్నారు స్థానికులు. గతంలో ఇతని లారీ డ్రైవర్ రోడ్డుపై బీభత్సం సృష్టించాడని గుర్తుచేస్తున్నారు. అప్పుడు నీతులు చెప్పిన ఇతను ఇప్పుడిలా దౌర్జన్యం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Full View

Tags:    

Similar News