Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
Hyderabad: హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్ సమీపంలో గల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
Hyderabad: హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్ సమీపంలో గల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. వీరు సరళమైసమ్మ దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.