ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెండు స్పాట్స్ ను గుర్తించిన క్యాడవర్ డాగ్స్: దుర్వాసనకు కారణం ఏంటి?

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో ఎండ్ పాయింట్‌లో రెండు ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

Update: 2025-03-08 07:13 GMT

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెండు స్పాట్స్ ను గుర్తించిన క్యాడవర్ డాగ్స్: దుర్వాసనకు కారణం ఏంటి?

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో ఎండ్ పాయింట్‌లో రెండు ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కేరళ నుంచి రప్పించిన క్యాడవర్ డాగ్స్ ను టన్నెల్ లోకి పంపారు.ఈ డాగ్స్ టన్నెల్ ఎండ్ పాయింట్ లోని రెండు ప్రాంతాలను గుర్తించాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఎనిమిది మంది ఉండి ఉంటారని రెస్క్యూ టీమ్ భావిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో రెస్క్యూ టీమ్ తవ్వకాలు చేపట్టారు. 15 రోజులుగా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కానీ, ఇంతవరకు ఆ ఎనిమిది మంది జాడ దొరకలేదు.

సొరంగం పైకప్పు కూలడంతో టీబీఎం మెషీన్ పాడైంది. ఈ మెషీన్ ముందు భాగం, వెనుక భాగంగా విడిపోయింది. టీబీఎం మెషీన్ ముందు భాగం బురదలో కూరుకుపోయింది. దీన్ని తొలగించేందుకు రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు ప్రాంతాల్లో దుర్వాసన వస్తోంది. అంతేకాదు టన్నెల్ లో ఇంకా వాటర్ సీపేజీ కొనసాగుతోంది. నిమిషానికి ఐదు నుంచి ఆరువేల లీటర్ల నీరు ఉబికి వస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రోబో సేవలను కూడా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రోబోటిక్ సేవలను అందించే సంస్థల ప్రతినిథులు మార్చి 7న టన్నెల్ లో పరిశీలించారు.

టన్నెల్ లో రెస్క్యూ సేవల కోసం చిన్న చిన్న ప్రొక్లెయినర్లను ఉపయోగిస్తున్నారు. టీబీఎం ముందు భాగంలోనే ఈ రెండు స్పాట్స్ ఉన్నాయి. టీబీఎం శకలాలను తొలగిస్తేనే ఈ రెండు స్పాట్స్ వద్దకు చేరుకోవడం సులభం అవుతోంది. టీబీఎంలోని సేఫ్టీ కంపార్ట్ మెంట్‌లో ఈ కార్మికులు ఉండి ఉంటారనే ఆశతో కూడా రెస్క్యూ టీమ్ భావిస్తోంది.

Tags:    

Similar News