Cabinet Meeting: ఇవాళ ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ
Cabinet Meeting: రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు
Cabinet Meeting: ఇవాళ ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ
Cabinet Meeting: ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 10గంటల 30 నిషాలకు జరిగే మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు సమాచారం అందించారు. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ పద్దులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందిస్తోంది. పరిమిత వనరులతోనే బడ్జెట్ 3 లక్షల కోట్లకు తగ్గకుండా కేసీఆర్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఆర్థిక శాఖ బడ్జెట్ ను రూపొందిస్తున్నారు.