Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం..!
TGSPC Chairmen: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా బుర్రా వెంకటేశం నియామకమయ్యారు.
Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం..!
TGSPC Chairmen:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా బుర్రా వెంకటేశం నియామకమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. బుర్రా వెంకటేశం ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో పూర్తికానుంది. దీంతో కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త ఛైర్మన్ కోసం ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం ఉన్నారు. ఐఎఎస్ అధికారిగా ఉన్న వెంకటేశం వీఆర్ఎస్ తీసుకోనున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.