ఆగని నిరసన.. సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ సభ్యుల బైఠాయింపు
Telangana Assembly: అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి.
ఆగని నిరసన.. సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ సభ్యుల బైఠాయింపు
Telangana Assembly: అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించారు. సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. సీఎం క్షమాపణ చెప్పేవరకు నిరసన చేస్తామంటూ బైఠాయించారు. దాంతో వారిని ఛాంబర్ నుంచి బయటకు పంపారు మార్షల్స్.