నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
నల్గొండలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ జనవరి 20న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
నల్గొండలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ జనవరి 20న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ జనవరి 21న ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి అంశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. రైతు భరోసాకు ఎకరానికి 15 వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం 12 వేలకు కుదించిందని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. నల్గొండ కలెక్టరేట్ వద్మద ఈ ధర్నా చేపట్టనున్నారు. అయితే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఈ ధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.