BRS: బీసీల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు
BRS: కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ బీసీ నేతలు ధ్వజమెత్తారు.
BRS: కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ బీసీ నేతలు ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లపై బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆక్షేపించారు. బీసీ రిజర్వేషన్లు జీవో ద్వారా అయితే మిగతా రాష్ట్రాలు చట్టబద్ధతను ఎందుకు కోరుతున్నాయని ప్రశ్నించారు. జీవో రాక ముందే ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడని... మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏం అయిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.