Harish Rao: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటర్లకు చీరలు, కుక్కర్లు పంచుతున్నారు
Harish Rao: జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు.
Harish Rao: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటర్లకు చీరలు, కుక్కర్లు పంచుతున్నారు
Harish Rao: జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు.. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటర్లకు కాంగ్రెస్ నేతలు చీరలు, కుక్కర్లు పంచుతున్నారని ఆరోపించిన హరీష్ రావు.. ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
సీ విజిల్ యాప్‌లో కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తున్నా అధికారులు వాటిని గుర్తించలేదని.. కట్టడి చేయలేదని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ కార్యాలయం పక్కనే పోలింగ్ బూత్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు హరీష్ రావు.