భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు..ఈసీకి ఫిర్యాదు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

Update: 2025-11-11 08:55 GMT

BRS: ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కింది

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా నిబంధనలను పక్కనబెట్టి.. జూబ్లీహిల్స్‌లో పర్యటించడం ఘోరమైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన అన్నారు. మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు బరితెగించి డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ అనుచరులు దాడులకు దిగుతున్నారని అన్నారు.

ఈ దౌర్జన్యాల మధ్య పోలీసులు, ఎన్నికల అధికారులు మౌనం వహించడం అత్యంత ఆందోళనకర విషయమన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలను.. వెంటనే ఆపాలని బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ఎన్నికల సంఘం వెంటనే దృష్టి సారించి, భట్టి విక్రమార్క సహా ఉల్లంఘనలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కోరింది.

Tags:    

Similar News