Mahipal Reddy: సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభించారు
Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో అల్పాహారం ప్రారంభం
Mahipal Reddy: సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభించారు
Mahipal Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన నియోజకవర్గంలో ప్రారంభించారు. తెల్లపూర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లల కోసం మార్నింగ్ టైమ్‌లో అల్పాహారం అందజేస్తున్నామన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.