అమ్మాయిల హాస్టళ్లలో అరాచకపర్వం.. వసతిగృహాల్లోకి చొరబడుతున్న ఆకతాయిలు

Update: 2020-03-14 06:36 GMT

అమ్మాయిల హాస్టళ్లలో అరాచకపర్వం కొనసాగుతోంది. వసతిగృహాల్లోకి ఆకతాయిలు చొరబడటం కలకలం రేపుతోంది. విద్యార్థినులకు భద్రతే లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. విద్యార్థినుల రక్షణ చర్యలు అధికారులు గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. రాత్రి పూట గదుల్లోకి కొందరు యువకులు దూరుతుండటంతో విద్యార్థినులు భయాందోళనలకు గురవుతున్నారు. అర్ధరాత్రి కరెంట్ నిలిపేసి మరీ హాస్టళ్లలోకి చొరబడుతున్నారు. అసలు...వసతి గృహాల్లో స్టూడెంట్స్‌కు సేఫ్టీ లేకుండా పోవటానికి కారణం ఏంటి?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాలికల హాస్టళ్లకు భద్రత కరువైంది. పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించటం కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్పొరేట్ స్థాయి విద్య, ఆశ్రమం కల్పిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వసతి గృహాల్లోని విద్యార్థినులు ఆకతాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట బాలికల గదుల్లోకి ఆకతాయిలు చొరబడుతుండటం తీవ్ర కలకలం రేపుతున్నాయి.

నార్నూర్‌ మండలం ఆదర్శ బాలికల వసతి గృహంలోకి ఓ ఆకతాయి వెంటిలేటర్‌ ద్వాకా చొరబడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ గదుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నైట్‌ అంతా రూమ్‌లో గడపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో హాస్టల్‌లో చొరబడిన యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయిని రూంలోకి రానిచ్చిన నలుగురు అమ్మాయిల సస్పెండ్‌ చేశారు అధికారులు.

కుమ్రంభీమ్‌ జిల్లా కెరమెరి మండలం ఝరి గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఇలాంటి ఘటన జరిగింది. ఆరు వందల మందికి పైగా విద్యార్థినులు ఉన్న హాస్టల్‌లోకి అర్ధరాత్రి సమయంలో ముగ్గురు యువకులు చొరబడ్డారు. ఇది గమనించిన విద్యార్థినులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు హాస్టల్ సిబ్బంది.

ఇలా నిత్యం వసతి గృహాల్లోకి ఆకతాయిలు చొరబడటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో అమ్మాయిలను ఉంచాలంటేనే వణికిపోతున్నారు. అకతాయిల అసాంఘిక కార్యక్రమాలకు హాస్టల్స్‌ అడ్డాగా మారుతున్నాయని విద్యార్ధి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు విద్యార్ధినలుకు భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాచ్‌మెన్‌ కూడా లేరని వార్డెన్లు రాత్రిపూట కన్నెతి కూడా చూడటం లేదని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయనే ఆరోపిస్తన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మాయిల హస్టళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Full View

  

Tags:    

Similar News