Bowenpalli Kidnap: హైదరాబాద్ భూవివాదం, కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Bowenpalli Kidnap: * ఏ3 భార్గావ్ రావు కోసం గాలింపు * విస్తృతంగా గాలిస్తున్న అధికారులు * చంచల్‌గూడ జైలులో అఖిల ప్రియ

Update: 2021-01-08 05:46 GMT

Representational image

తెలుగు రాష్ట్రాల్వో సంచ‌ల‌నం రేపిన బోయిన్ ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వ‌స్తున్నాయి. ముందు ఏ2గా చూపిన అఖిలప్రియను ఏ1గా చేర్చడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఏ3గా ఉన్న అఖిల ప్రియ భ‌ర్త భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడ‌నే స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. కేసు వెలుగులోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి భార్గవ్ రామ్ అజ్ఙాతంలోకి వెళ్లాడు. అస‌లు భార్గవ్ ఎక్కడ ఉన్నాడనేది ఇప్పడు పోలీసులకు సవాల్‌గా మారింది. నిజంగానే భార్గవ్ రామ్ ప‌రారీలో ఉన్నాడా? లేకపోతే, పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

బోయిన్ ప‌ల్లి కిడ్నాప్‌ కేసు బెడిసి కొట్టడంతో భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో తమ పేర్లు బ‌య‌ట‌కు రావడంతో బెంగ‌ళూరు వెళ్లి అక్కడి నుంచి మైసూర్ వెళ్లిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మైసూర్‌లో భార్గవ్ రామ్‌కు ఆశ్రయం ఇచ్చిందెవరు అనేదిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే భార్గవ్ రామ్ కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి.

మ‌రోవైపు అఖిల‌ప్రియ అరెస్ట్ త‌ర్వాత భార్గవ్ రామ్‌ను అదుపులోకి తీసుకోవ‌డానికి ఇంత స‌మ‌యం ఎందుకు ప‌డుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, బెంగ‌ళూరు, మైసూర్ తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలు గాలింపు చేప‌ట్టాయి. మరోవైపు పోలీసులు భార్గవ్ రామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నార‌న్నా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అఖిల ప్రియ విచార‌ణ‌లో ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే ఏ3 భార్గ‌వ్ రామ్‌ను అదుపులోకి తీసుకున్నారని కానీ అధికారికంగా పోలీసులు దృవీక‌రించ‌ట్లేర‌నే వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. దీంతో ఈ కేసులో ఏ3 పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News