నేడు నగరంలో బోనాల వేడుకలు...

Update: 2019-07-28 03:28 GMT

హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంతో పాటు నగరం లోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరం పరిధిలో 2500 ఆలయాల్లో ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి. ప్రసిద్ధి గాంచిన పాతబస్తీలోని లాల్ దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శ్రీ సింహవాహిని ఆలయం,లాల్ దర్వాజ, మీరాలం మండిలోని మహంకాళి, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ, కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ,సబ్జి మండిలోని నల్ల పోచమ్మ, మహంకాళమ్మ, చిలకలగూడలోని కట్ట మైసమ్మ, బాలంరాయి దండు మారెమ్మ ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News